తెలుగు నిర్మాతల మండలి కి ముచ్చటగా మూడు సార్లు రాజీనామా చేసి
మళ్ళి వెనక్కి తీసుకొన్న శ్యాంప్రసాద్ రెడ్డి గార్కి ఓ బహిరంగ లేఖ.
Click on read more to view the complete article
1800 సభ్యులు వున్న నిర్మాతల మండలి కి అద్యక్షుడు గా వున్న మీరు కొద్ది మంది 'బాగు' కోసం పని చేద్దామని నిర్ణయించుకొన్నారు. మీనుండి చిన్న నిర్మాతలకి ఏదో 'మంచి' జరుగు తుంది అని బ్రమ నుండి త్వరగా బయట పడేటట్టు మీ మాటల ద్వారా చేసినందుకు కృతఙ్ఞతలు.
టికెట్ రేట్ పెరగాలనే మీ సొంత అభిప్రాయాన్ని వార్షిక సర్వ సభ్య సమావేశం లో 'ధైర్యంగా' ప్రస్తావించి, టికెట్ రేట్ లు తగ్గించా లానే ప్రతిపాదనికి నిరసన గా రాజీనామా చేసివుంటే మీ వ్యక్తిత్వం బయటపడేది. అందరి మన్ననలు లభించేవి,
కానీ ఒక గదిలో పది మంది ముందు నా అభిప్రాయం 'టికెట్ రేట్ లు పెరగాలి' అని చెప్పి దానికోసం ప్రభుత్వాన్ని 'నిర్మాతల మండలి' అధ్యక్షుడి హోదా లో కోరటం సబబేనా?
టికెట్ రేట్ లు పెరిగితే ఇండియా ఎలా అభివృద్ధి చెందుతుందో వివరిస్తారా? బ్లాక్ మనీ తీసుకోకుండా మొత్తం వైట్ లోనే తీసుకొంటే మన దేశం చాల అభివృద్ధి చెందుతుంది అనండి అంగీకరిస్తాం
అద్యక్షుడి పదవి లో మీరు ఇంకా 9 నెలలు మాత్రమే వుంటారు ఆ తర్వాత '500 మంది తీసుకొన్న నిర్ణయాలకి విలువ ఇవ్వకుండా,చిన్న నిర్మాతల కి ఉపయోగపడ కుండ పదవి కాలం పూర్తి చేసిన 'మరో' మాజీ అధ్యక్షుడు గా మిగిలి పోతారు.
'మేము పది మంది బయటకు వెళ్లి వేరే అసోసియేషన్ పెట్టు కుంటే ఈ ఇన్సురన్స్ సౌకర్యాలు పోతాయి' అన్నారు
సంతోషం ఆ పని వెంటనే చేయమని వేడుకొంటున్నాం,ప్రార్ధిస్తున్ నాము,అర్దిస్తున్నాం!
మండలి లో వున్న పది కోట్ల ఫండ్ మీ సొంతం కాదు, దాని మీద వచ్చే వడ్డీ తోనే సభ్యుల కి ఉపయోగం జరుగుతోంది తప్ప ఆ డబ్బు ఎవరి జేబు లో నుంచి రాలేదు కదా?
'ఫిలిం చాంబర్' ఆఫీసు వైజాగ్ లో కొన్న దాంట్లో 16 లక్షలు కమీషన్ నొక్కేసారన్న ఆరోపణ వున్న ఓ పెద్ద మనిషి కూడా రెచ్చి పోయి మాట్లాడితే ఎలా ?
శ్యాం గారు చివరిగా ఒక మాట
రాజకీయలతో ముడిపడి వున్న పదవులు వదిలేసి
అమ్మోరు,అరుంధతి,అంకుశం,ఆహుతి, తలంబ్రాలు లాంటి
గొప్ప సినిమాలు తీసేoదుకు మీ శక్తి,యుక్తి లను వాడమని కోరుకుంటూ
చిన్న సినిమాని బతికించుకొందామని పోరాడుతున్న సైన్యం.
ps:- Bhaskar reddy garu.. Thanks for bringing the hidden truths..