Monday, July 5, 2010

Jhummandhi naadam movie review - My view

దర్శకేంద్రుడి కొత్త సినిమా "ఝుమ్మంది నాదం" సినిమా మీద నా రివ్యూ.. చూడాలి అంటే క్లిక్ ఆన్ రీడ్ మోర్.


ఈ సినిమా గురించి చెప్పుకునేముందు ఒకటి చెప్పాలి, హీరోయిన్ నీ అందంగా చూపించటం లో రాఘవేంద్ర రావు గారి తర్వాతే ఎవరు అయిన. అదీ ఎంత నిజమో మనం ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది. రాఘవేంద్ర రావు గురించి నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు. ఆయనకు ఆయనే సాటి... ఇన్నాళు చేమంతి పూలు, బత్తాయ్ కాయలు వాడిన ఆయన ఇప్పుడు promotion లా ఫీల్ అయ్యి.. ఈ సినిమా లో గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలు వాడారు.



సినిమా గురించి :-

భద్రాచలం నుంచి సింగెర్ అవుదామని వచ్చిన ఒక యువ గాయకుడి గా మనోజ్ చేసాడు. ఇప్పటి generation అంటే చిరాకు పడే పాత్రలో mohanbabu గారు చేసారు.ఇంకా అమెరికా నుంచి తెలుగు పాటల మీద research చేసే అమ్మాయీ గా తాప్సీ నటించింది. మన మనోజ్ ఆ హీరోయిన్ కి ప్రాజెక్ట్ పని మీద హెల్ప్ చేస్తూ తన goal ఎలా చేరుకున్నాడు అనేధే ఈ సినిమా స్టొరీ...



Performances :-

మనోజ్ , మోహన్ బాబు గురించి చెప్పేది ఏముంది, మనోజ్ చాల బాగా చేసాడు.. కొన్ని scenes లో మోహన్ బాబు ని అనుకరించి చేసిన వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

తప్సీ ని performace కంటే, స్కిన్ షో కి ఎక్కువగా ఉపయోగించు కున్నారు.

Comedians అంత వాళ్ళ పాత్రల meeraku చేసారు..



విశ్లేషణ :-

సినిమా అంత ఒకే మూస లో వెళ్తుంది, ఒక పాట రెండు కామెడీ scenes , మల్ల ఇంకో పాట.. ఇలా సినిమా అంత మూడు పతులు ఆరు కామెడీ స్సున్స్ ల వుంటుంది కానీ.. కథని ముందు కి జరిపే scenes చాల తక్కువ అని చెప్పొచ్చు.

ఫ్లాష్ బ్యాక్ లో అస్సలు emotion క్యారీ అవ్వలేదు, ఏదో హీరో ఊరికే అల challenge చేయాలి అని చేపించి నట్టు వుంది కన్ని.. ఆ scenes లో అస్సలు బలం లేదు.

ఇక్కడ కామెడీ ఏంటి అంటే, హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్పగానే ఫ్రండ్స్, నీ మనుసులో ఇంత బాధ వుంచుకొని ఎలా వున్నావు రా. అంటున్నప్పుడు ధియేటర్ అంత ఒకటే నవ్వులు.

పెళ్లి పాటలో పెళ్లి కూతురితో ఆ స్కిన్ షో అవసరమా అనిపించింది.



Positive Points

1 ) Brahmi చేసే "ఓవర్" అన్న కామెడీ సీన్ కి నవ్వులే నవ్వులు..

2 ) సెకండ్ హాఫ్ లో మోహన్ బాబు కి మనోజ్ కి వచ్చే "నిగ్రహం" scenes .

౩) తాప్సీ glamour మూవీ కి హైలైట్.

4 ) సాంగ్స్ టేకింగ్ అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ బావుంది.

5 )"నిగ్రహం" సాంగ్ ధియేటర్ లో మెర్కురీ లెవెల్ ని పెంచుతుంది.



ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ సినిమా ని మీకు పని ఏమి లేకపోతేయ్, అండ్ టైం పాస్ చేయాలి అంటే చుడండి .. మూవీ బోర్ ఐతేయ్ కొట్టదు.

ps :-old Generation ,New Generation కి గ్యాప్ అని చెప్పిన ఈ సినిమాని... ఓల్డ్ generation స్టైల్ లో తీసారు... సాంగ్స్ అండ్ మూవీ లో మనోజ్ కంటే తాప్సీ నీ చూసి whistles అండ్ క్లాప్స్ పడ్డాయి(action ni chusi anukuneru.. glamour ni chusi).. . ఈ సినిమా ని మనోజ్ మార్కెట్ పెంచాలి అని తీస్తేయ్.. తాప్సీ కి మార్కెట్ పేరిగేల చేసింది...టైం అంటే యిదీ నేమో..




2 comments:

Unknown said...

Anna, e cinema time passki chooddaniki kooda baga ledhu. Heroine kosam theesinattundhi e cinema. Mohan Babu action ithey chetthaga undhi. Memu theatre loki velli cinema choosthuntey, yendhuku vachaamu ra anipinchindhi. Over all ga cinema ithey utter flap and dabba movie.

Me blog e roju check chesanu. Over all opinion yenti antey, meeru TDP party fan ani Chiru family antey peddhaga padadhu ani. Anna, Public Blogs start cheinavaru nijalu rayali anna. Me opinions rayakoodadhu.

Sasidhar Anne said...

hey phani.. Thanks for visiting.. nenu TDP supporter ni kadu kani.. vunna parties kante TDP better ani feeling vunnavadini..
Chiru meeda naa opinion cheppa anthey.. and this blog is publish my views.. andukani ala rasa..thammi..

nuvvu kuda emmana articles rasi publish cheyali anukunte.. check freindsHub