Sunday, June 17, 2012

Very Good Analysis on future of YSR Congress Party by Praveen - Nagrockz


Very Good write up by praveen anna.. Click on read more to read the article


తెలుగు దేశానికి, కాంగ్రెస్ కి లేనిది వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కి ఉన్నది.....చరీష్మా ఉన్న లీడర్,జగన్. ఎన్ టి ఆర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి లేట్ శ్రీ వై ఎస్ ఆర్. ఆయన వారసుడు గా ఎంటర్ ఐన జగన్ కి వై ఎస్ ఆర్ కి ఉన్న చరిష్మా ఆయన లానె ఉన్న బాడి లాంగ్వేజ్ వల్ల కావొచ్చు,మాట తీరు వల్ల అవొచ్చు వచ్చేసింది.

ఇప్పుడు జైల్ లొ ఉన్న జగన్ కి, పెవిలియన్ లో ఉన్న సచిన్ కి పెద్ద తేడా లేదు. కాని సచిన్ కి సింపతి ఉండదు. అంతే తేడా. సచిన్ అభిమానులు నన్ను తిట్టుకోవద్దు, ఇది కేవలం పోలిక గురించే. సచిన్ ఒక వేళ మాచ్ ఆడి ఉన్న ఇరగతీసుకుని కొట్టినా మిగతా టీం అంత చెత్త గ ఉంటే అపోనెంట్ కెన్యా అయిన మాచ్ పోతుంది.

కరెక్ట్ గా వై ఎస్ ఆర్ సి పి పరిస్థితి కూడా అదే. మంచి కేప్టన్ ఉన్న చెత్త టీం ఉంది. జగన్ జైల్ కి వెళ్ళగానే అమ్మ చెల్లి రోడ్ మీదకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని కల్లు నొక్కుకొగానె...జనం ఇ వి ఎం లో ఫాన్ గుర్తు కి ఉన్న మీట నొక్కేసారు. వై ఎస్ ఆర్ సి పి కంగ్రెస్స్ వోట్ బాంక్ ని తునాతునకలు చేస్తూ టి డి పి వోట్ బాంక్ ని చీలుస్తూ గెలిచింది. ఇది విజయమ్మ అద్భుతం ఐన వక్త అవ్వటం వల్లనో,షర్మిల కు చరిష్మా ఉందటం వల్లనో అవ్వలేదు. వాళ్ళ ఒరిజినల్ కెపాసిటి బయట వ్యక్తుల కంటే వై ఎస్ ఆర్ సి పి లీడర్స్ కి బాగ తెలుసు. అందుకే ఎలెక్షన్ గెలిచిన రోజున 3 నిమిషాల ప్రెస్ స్పీచ్ కి రెందు వైపుల ఇద్దరు నుంచుని ప్రాంప్టింగ్ ఇచ్చారు. నిజానికి అది అతి పెద్ద మ్యాటర్ కాదు. వై ఎస్ ఆర్ సి పి ని గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పటం అంతే. యండమూరి వీరేంద్ర నాథ్ లాంటి వ్యక్తిత్వ వికాస నిపుణుడు క్లాసెస్ తీసుకుంటున్నారు వేళ్ళకి. సో ఇలాంటి అపసవ్య దిశ లొ దూసుకు పొయే బాణం ఎక్కువ రోజులు పార్టి ని కాపాడలేదు.

ఇక పొతే సెకండ్ గ్రేడ్ లీడర్స్ లో ఆ పార్టి నుంచి ఈ పార్టి నుంచి వలస వచ్చిన రాజకీయ నిరుద్యొగులు తప్పితే ఈ పార్టి విధి విధానాలు నచ్చి వచ్చిన వారు లేరు. ముఖ్యం గా ప్రస్తుతం మహిళ ల నేత్రుత్వం లో ఉన్న ఈ పార్టి కి సెకండ్ గ్రేడ్ మహిళా నెతలే అతి పెద్ద సమస్య. రాజకీయాల్లొ ఐరన్ లెగ్ గ ముద్ర పడిన రోజా అరుపులు కేకలు తప్పితే కంటెంట్ ఉందదు. జనం పల్స్ వై ఎస్ ఆర్ సి పి కి ఉంది కబత్తి ఈ పార్టి లొ జాయిన్ అయ్యను అనె వాసిరెడ్డి పద్మ, అసలు రాజకీఆల్లో దేనికి ఉండాలొ తెలీని లచ్చిం పార్వతి వీళ్ళు ఇప్పుడు ఉన్న పోటీ రాజకీయాల్లో పనికి రారు.

సబ్బం హరి మినహ కస్త సెన్సిబుల్ లీడర్ పార్టి లొ లేడు. సంజనా రాంబాబు రొప్పుతూ అరవటం తప్పితే మాటర్ నిల్. బాలినేని అతి గొప్ప వక్త ఏమి కాదు. కొత్త గా చేరే వారిలొ నూటికి 90% మంది లీడర్స్ ఈ పార్టి కి డబ్బు సింపతి ఉన్నాయి కాబట్టి చేరుతున్నారు అనేది జగన్ మనసుకు తెలిసిన సత్యం.

సింపతి వల్ల పడిన వోట్స్ కాని బలం ఐన కాడర్ లేని పార్టి వై ఎస్ ఆర్ సి పి. పార్టి నాయకుడు అరెస్త్ ఐతే రోద్ మీద కనిపించేది కాడర్ ఆ వోటర్ కాదు. అందుకే కాడర్ అంత ఇంపార్టంత్. They can make a party,they can break a party. 120 ఇయర్స్ గా కాంగ్రెస్ 30 ఇయర్స్ గ టి డి పి పెద్ద దెబ్బలు తట్టుకుని నిలబడుతుంది ఆ కాడర్ వల్లనే. లీడర్స్ పొతే కొత్త లీడర్స్ పుట్టొచ్చేమొ కాని కాడర్ పుట్టదు.

ఇన్ని లిమిటేషన్స్ ఉన్న వాటిని ఎలా అధిగమించాలో చూడకుండా దశబ్దాలు గ రాజకీయాల్లొ ఉంతున్న ప్రత్యర్ధి పార్టీ లని ఆ పార్టి లీడర్స్ ని కామెంట్ చెయ్యటం కరెక్ట్ కాదు. నమ్మకం ఉండొచ్చు అతి నమ్మకం కూడదు.

ప్రజా రాజ్యం పెట్టిన కొత్తల్లో ఆ పార్టి కాషియర్ అల్లు అరవింద్ ఒక మాట అన్నారు. పులివెందుల/కుప్పం తప్పితే అన్ని సేట్స్ మేమే గెలుస్థాం. ఆ రెందు కుద ప్రతిపక్షం లొ నాయకులు ఉండాలి కబత్తి వారికి వదిలేస్తాం అని. కట్ చేస్తె కోట్లు కర్చు పెట్టి ఈయన ఎం పి గ ఓడారు. ఆడ లేడిస్ చేతిలొ అన్నియ్య మునిగారు.

నాకు వై ఎస్ ఆర్ సి పి లో కూడ సేం సిట్యుఎషన్ కనిపిస్తుంది. సింపతి మీద వోట్ ఒక సారె పడుతుంది. ఇ.డి ఆస్తులు జప్తు చేసి, విజయమ్మ అస్త్రం ఆల్ రెడి వాడేసి , 2014 కి కూడ జగన్ జైల్ లొ ఉంటే లీడర్స్ లేని కాడర్ లేని ఈ పార్టి పరిస్థితి ఏంటి? ఇన్స్టాంట్ గ అధికారం కావాలి అని వలస లతో పార్టి ని నడిపిన మరొ పి ఆర్ పి గా..... వై ఎస్ ఆర్ సి పి అయ్యే రోజు దగ్గర్లోనే ఉందా?

©www.myreviews4all.blogspot.com