Saturday, October 5, 2013

My Fav Blogger review on AD..

Jaajipoolu blog nestham akka about AD movie.. funny..

ఎట్ట్కేలకు మా అమ్మాయి రెండు రోజులు ఏడ్చి సాధించి అత్తారింటికి దారేది సినిమాకు తీసుకు వెళ్ళేలా చేసింది..మా ఆయన,బాబుగాడు మొదటి రొజు ఆట చూసొచ్చి తలకు నవరత్న కేష్ తైల్ దిట్టంగా పట్టించి వార్నింగ్ ఇచ్చినా మా గాడిద ససెమిరా అంది...
ఓక అత్త ఇద్దరు మరదళ్ళు ఒక అల్లుడు సినినిమా ఇష్టోరీలంటే పరమ విరక్తినాకు... ఈసారన్నా పవనయ్య ,తివిక్రం కొద్దిగా కాకపోతే కొద్దిగన్నా కధ పెట్టి సినిమా తీసుంటారా లేదా అని డవుటనుమానంతోనే వెళ్ళా...సినిమా స్టార్ట్ అవ్వగానే సమంతా కిడ్నాప్ ... నాకు టిష్యూ ఇవ్వండి ప్లాష్ బ్యాక్ చెప్తా అంటుండి ..ప్రేక్షకులకు ముందుగానే హింటిస్తూ... మా అబ్బాయి దారిలో కట్టించిన టిపినీ ప్యాకెట్లు ఓపెన్ చేసి.. ఆమ్మా సమోసా కావాలా ... ఫునుకులు కావాలా అన్నాడు... ఊ .. రెండూకాదు కాదు.. వంకాయబజ్జి అన్నాను...అది కాదమ్మా ఇది బాగుంటాది అనివాడు...యెహే నాకు నచ్చింది ఇవ్వూ అని నేను కొట్టుకునే లోపల పవన్ కళ్యాన్ వచ్చేసాడు..
మావాడు కయ్యిమని ఒక కేక వేసాడు..పిల్లాడికి ఇంకా విజిల్ వెయ్యడం రాలేదు మరి ..
ఓయ్ ఏంటా అరుపులు అన్నాను .. ఫక్కన ఉన్న అభిమాని హర్ట్ అయ్యి అరవనివ్వండి .. ఇది పవనిజం అన్నాడు.. దెబ్బకి నేను హర్ట్ అయాను. వీపు మాడిపోద్ది వెదవ.. నోరుమూసుకు చూడు అని ఒక్క గసురుగసిరా..ఇద్దరూ సైలెంట్...

ఈ లోప్ల పవన్ తాతయ్య నాకు ఈ టెబుల్ అంతా నిండిపోతే చూడాలని ఉందిరా అన్నాడు... దానిదేం బాగ్యం నీ మనవడి వెనుక ఉన్న జనాలను అందరిని కూర్చోపెట్టెయ్ సరిపోద్ది అన్నా... ఆ కామెంట్ నా కూతురికి నచ్చలేదు...డాడీ ..మమ్మీని నీ పక్కన కూర్చోమను అని ఏడుపు మొదలేట్టింది.. ఇక తప్పక సినిమా చూడాల్సొచ్చింది..

అసలు సినిమా అటే అది.. అడ్డెడ్డేడ్డే ఏం తీసాడు ...తాతయ్యా అత్తను ఇంటికి తీసుకువస్తా తాతయ్యా అని శపధం చెయ్యగానే వీడు ఆరడగుల పుల్లట్టు అని పాట..( సారి బుల్లెట్టు అంటకదా ..మొన్నటివరకూ పుల్లట్టూ అనే పాడుకుని.. ఇదేం పాటరాబాబు అనుకునేదాన్ని..)అసలు నాకు తెలియక అడుగుతాను ... హీరో వెళ్ళేది కార్గిల్ వారుకా ..లేకపోతే అన్యాయ్యాన్ని ఎదిరించడానికా... అత్తగారిని ఇంటికి తీసుకురావడానికే కదా... అక్కడ అత పవర్ఫుల్ పాట అవసరమా... పాపం పిల్లాడు పాటలో ఒక్క స్టెప్పు జోలికి వెళ్ళలేదు ..అటు ఇటు వాకింగి చేసాడు..

సరే పాట సంగతి ఓకే.. హీరో వెనుక అరడజనుమంది అసిస్టెంట్లు ..అదులో ఇద్దరితో మాత్రమే హీరో మట్లాడతాడు..సారి ..ఎడపెడా కొడుతుంటాడు..వాల్లు కూడా తిన్నంగా ఉండరు ... ఫరమానందయ్య శిష్యుల్లా అడ్డదిడ్డంగా వాగుతుంటారు..మరి అలాంటివాళ్ళను జాబ్లో పెట్టుకుని లక్ష కోట్లు ఎలా కాపాడుతాడొ హీరో అన్ తెగ జాలేసింది నాకు..

ఇక హీరోకి ప్రేమ అనే విషయం మీద పెద్ద అభిప్రాయం ఏం ఉండదు ఇది కాకపోతే అది.. ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల అని సరిపెట్టేసుకుంటాడు పాపం..సినిమాలో నచ్చిన విషయం ఏమిటంటే ఐటం సాంగ్స్లో అమ్మాయిలు చీరకడితే వీరోయిన్లు పొట్టిబట్టలేసుకుంటారు...

మధ్యలో సమంతా మెమొరీ పోవడం చూసి విరక్తి వచ్చింది కాని సినిమా అయ్యాకా ఇంచుమించు నాక్కూడా కాసెపు తల తిరిగినట్లయ్యి పాపం తివిక్రం తప్పేం లేదనిపించింది... ఛివర్లో హీరోగారు 5 నిమిషాల్లో నాకు రైల్వే స్టేషన్ ఖాళిగా అయిపోవాలి .. ఇళ్ళకు వెళ్ళవలసినవాళ్ళను ప్లైటుల్లో వాళ్ళ. కొంపలకు చేర్చండి అనే డయిలాగ్ సినిమాకే హైలెట్.. దానికంటే రైల్వేస్టేషన్లో బాంబ్ పెట్టారు అని అనౌన్సు చేయించేయాల్సింది.. ఓహో ప్రయాణికులతో పాటు అత్తగారు కూడా పారిపోద్ది అని బయమేసి ఉటుంది.. నిజమే అదుకే తివిక్రం గొప్పోడయ్యాడు..

అసలు ఆ ఇంట్లో పొలోమని జనాలు ఉంటారుగాని ఒక్కళ్ళకు కూడా సరి ఐన డయిలాగ్లేదు.. కోటా ని ఒక్క సారి కాదు రెండుసార్లు పాపం పిలిచి తన్ని పంపేస్తారు.. ఆహుతి ప్రసాద్ ఎందుకున్నట్లో..అసలు హేమ పాత్ర దేనికి..? భ్రహ్మానందంతో తిరిగి ఆ ఇంట్లో ఎందుకు హీరో వెళతాడొ ..ఎందుకు బ్రహ్మిని ఏడిపిస్తాడొ .ఉఫ్ఫ్ఫ్ నాకైతేం అర్ధం కాలేదు..

హీరోయిన కార్లో డ్రెస్సు మార్చుకోవడం ఏమిటొ.. ఆలికి కోటీస్వరుడిని అని నిజం చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం ఏమిటొ..అసలు బ్రహ్మ్మి ఇటికి వచ్చిన గెస్ట్ పైగా మగ పెళ్ళి వారి తరుపు.. అతన్ని పట్టుకుని పెద్దవాళ్ళు కూడా కొట్టేయడమేమిటొ..

సరే సినిమా పక్కన పెడితే నదియా చీరలు బాగున్నాయి.. రెండు జూట్ చీరలు కట్టింది మధ్యలో అందులో ఓ చీర మొన్న మా అత్తగారు కొన్నారు..పెద్ద రేటేం కాదు... ఇక సమంతాకి ఎవరన్నా చీరకట్టినప్పుడు మెడలొ గొలుసేసుకోమని చెప్పండమ్మా.. సినిమాలో అందరూ బ్లవుజులకు తాళ్ళు పెట్టించారు.. మొన్న మా పనిమనిషి ఇప్పుడు కూలోళ్ళు నాలోళ్ళు కూడా తాళ్ళు పెడుతున్నారమ్మా అందని న డ్రెస్సు కి ఉన్నవి క్త్ చేసేసా.. ఇప్పుడు బాధొస్తుంది ..
సినిమా ఐపోయాకా మ అబ్బాయి ఒక మాట అనడు ..మమ్మీ ఎవడు కూడా ముందె పైరసీ చేస్తే బాగుండు ఎంచక్కా..హిట్టూయిపోద్ది ఆని


©www.myreviews4all.blogspot.com