Friday, January 18, 2013

Dedication on Great NTR on Sets and his passion on movies




So great of NTR.. Below incident shows the dedication of NTR 

ఈనాటి తారలు చాలామంది షూటింగ్‌లో తాము ధరిస్తున్న పాత్ర పట్ల చూపవలసిన శ్రద్ధ కంటే, తమకు ఏర్పాటుచేసిన వసతులు, సౌకర్యాల విషయంలో చాలా పట్టింపుగా ఉంటారని చిత్ర పరిశ్రమలో అనుకుంటూ ఉంటారు. ఆ విషయంలో ఏ చిన్న లోటు జరిగినా, నిర్మాత సమస్యల గురించి ఆలోచించకుండా నానా రభసా చేస్తుంటారు. అలాంటి తారలకు- ఎన్‌టిఆర్ నట జీవితంలోని ఈ అనుభవం ఓ గుణపాఠం కావాలి. ఇది చాలాకాలం నాటి మాట. అప్పుడు ఏవిఎమ్‌వారి ‘్భకైలాస్’ చిత్రం షూటింగ్ ఏవిఎమ్ స్టూడియోలో జరుగుతోంది. ఆ చిత్రంలో ఎన్‌టిఆర్ రావణుడి పాత్ర ధరించారు. అది రావణాసురుడు తపస్సుచేసే ఘట్టం. గడ్డం, మీసాలతో ఎన్‌టిఆర్ పుట్టలమధ్య కూర్చున్నారు. కొన్ని షాట్స్ తీశాక, ఆయన చుట్టూ ఉన్న పుట్టలు, పొదలూ అంతకంతకూ దట్టమవుతున్నట్లు అమరుస్తూ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
లంచ్ వేళలో ‘‘్భజనానికి రండి సార్’’ అని ఎన్‌టిఆర్‌ను దర్శకుడు కె.శంకర్ పిలిచారు. ‘‘్ఫరవాలేదు.. మీరు చేసి రండి’’ అని ఎన్‌టిఆర్ అంటుంటే, దర్శకుడు ఆయన్ని రమ్మని మరీ మరీ అడిగారు. ‘‘చూడండి బ్రదర్.. ఎంతో కష్టపడి చుట్టూ ఈ పొదలు, పుట్టలూ వేశారు. నేను లేవాలంటే, వీటిని తొలగించి మళ్లీవేయాలి. నాకు ఈ గెడ్డం అదీ చక్కగా అమరింది. నేను లేస్తే ఈ కంటిన్యుటీ అంతా దెబ్బతింటుంది. అంచేత ఏదీ కదిలించకండి.. ఈ ఒక్క పూట నాకు భోజనం లేకపోతే, కొంప మునిగేదేమీ లేదు.. డోన్ట్ వర్రీ.. మీరంతా వెళ్లి భోంచేసి రండి..’’ అంటూ రాత్రి ఆ సీన్ ముగిసేవరకూ ఆహారమేమీ తీసుకోకుండా అలా నటనా తపస్సులో నిమగ్నమైపోయారు ఎన్‌టిఆర్. ఈరోజుల్లో అలాంటి అంకితభావం ఎంతమంది తారలకు ఉంటుందంటారు?

Source : Andhrabhoomi



©www.myreviews4all.blogspot.com

No comments: